Monday, April 29, 2024

వరద బాధితులను ఆదుకుంటామన్న భూమన..

తిరుపతి, (ప్రభ న్యూస్): తిరుపతిలో వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అంచనా వేసేందుకు సర్వే జరుగుతోందని తెలిపారు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణను వెంట తీసుకుని రాయల్ నగర్, మధురానగర్, యశోధనగర్, అబ్బన్న కాలనీల్లో శుక్రవారం ఉదయం పర్యటించారు.

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. మునుపెన్నడూ లేనివిధంగా తిరుపతిలో వర్షం కురిసిందని, దీంతో అనేక ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం పెరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రణాళికలు చేపట్టాలను అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోవరద నీటి కాలువలను ఎత్తు పెంచనున్నట్టు వివరించారు. నాగర్, యశోదానగర్ ప్రాంతాలు జలమయమైన కారణంగా మరోసారి పరిశీలించారు. స్థానిక ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

మధురవరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి వరద నీటిని మళ్లించేలా చేసినందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ల మీద వ్యర్థాలు పేరుకు పోవడం వల్ల ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తక్షణమే తొలగించాల్సిందిగా అధికారులకు భూమన సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజాప్రతినిధులుగా తాము, అధికారులు సహాయక చర్యలు చేపడతామని భూమన స్పష్టం చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement