Friday, April 26, 2024

‘బుల్లెట్ బండి’ పాటకు వధువు డ్యాన్స్..షేకవుతున్న సోషల్ మీడియా..

పెళ్లి బరాత్ లో ఓ వధువు చేసిన డ్యాన్స్ గత రెండురోజుల నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. సాధారణంగా అయితే పెళ్లిల్లో వదువు-వరుడి స్నేహితులు గాని సన్నిహితులు గాని డ్యాన్స్ చేస్తారు. కాని ఈ మధ్య ట్రెండ్ మారుస్తు కొన్ని చోట్ల వరుడు పెళ్లి బరాత్ లో చిందులేయడం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. వెరీ వెరీ లేటెస్ట్ ఇప్పుడు అంతా టిక్ టాక్ జమానా….పెళ్లి కూతురే డ్యాన్స్ చేయడం నయా ట్రెండ్ గా మారింది. టిక్ టాక్, సోషల్ మీడియా ఫుణ్యమాని అమ్మాయిలు తమ కళలకు పదును పెడుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను గిర్రున చుట్టేస్తోంది. తాజాగా ఓ వధువు తన పెళ్లి త‌ర్వాత జ‌రిగిన‌ బరాత్‌లో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతా పా’ అనే పాట‌కు ల‌య బ‌ద్దంగా కాలు క‌దుపుతూ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది.. వ‌ధువు స్టెప్పుల‌కు.. ఫిదా అయిన భర్త అలా చూస్తుండి పోయాడు.. అయితే వ‌ధువు ఏదో ఒక్క స్టెప్పు వేసి ఊరుకోలేదు.. పాట పూర్తిగా అయిపోయేవ‌ర‌కు త‌న నృత్యంతో ఆక‌ట్టుకుంది.. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఇక యూట్యూబ్ లో వధువు డ్యాన్స్ ను చూసిన వారంత ఈలాంటి అమ్మయి తమకు వధువుగా రావాలని కామెంట్స్ పెడుతున్నారు.

‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ సాంగ్ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బంపర్ హిట్టయింది. తెలంగాణ పల్లేల్లో ఎక్కడికెళ్లిన ఏదో ఓ చోట ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. అసలే అందరికి సుపరిచిమైన పాట అందులోను వధువు స్టెప్పులేయడంతో ఇప్పుడు ఈ పాట మరింత హైలెట్ అవుతోంది. కాగా, ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా బా’ పాటకు రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు.. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. ఈ క్రమంలోనే వివాహ వేడుక అనంతరం తీసిన బరాత్‌లో వధువు ఈ పాటకు డ్యాన్స్‌ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=A4PYMq8Dz-s

ఇది కూడా చదవండి: సునంద పుష్క‌ర్ కేసు.. కాంగ్రెస్ నేత శశిథరూర్ కు బిగ్ రిలీఫ్

Advertisement

తాజా వార్తలు

Advertisement