Thursday, April 25, 2024

సునంద పుష్క‌ర్ కేసు.. కాంగ్రెస్ నేత శశిథరూర్ కు బిగ్ రిలీఫ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్​కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయన్ను డిశ్చార్జ్ చేసింది. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అభియోగాల‌ను తోసిపుచ్చిన ఢిల్లీలోని సెషన్స్ కోర్టు.. ఇవాళ ఆయ‌న‌కు నిర్ధోషిగా ప్ర‌క‌టించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ లో శవమై కనిపించింది. ఆమె డ్రగ్స్ వాడిన‌ట్టు వైద్యుల నివేదిక సూచించింది. ప్రాథమిక విచారణలో ఇది హత్యా? కాదా ? అనే కోణంలో విచారణ జ‌రిపిన పోలీసులు చివ‌ర‌కు ఆత్మహత్యాయ‌త్న‌గా చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, సునంద్ పుష్కర్ ను ఆత్మహత్య చేసుకొనేలా శశిథరూర్ ప్రేరేపించారని ఆయనపై ఆరోపణలువ‌చ్చాయి.. ఐపీసీ సెక్షన్ 498 ఎ (వైవాహిక క్రూరత్వం) మరియు 306 (ఆత్మహత్యకు ప్రేరణ) సెక్ష‌న్ల కింద ఈ కేర‌ళ కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. చార్జిషీట్‌లో కూడా చేర్చారు.. మొత్తంగా ఇవాళ ఆయ‌న‌కు ఈ కేసులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసు వల్ల ఏడున్నర ఏళ్లుగా తాను మానసిక ప్రశాంతత కోల్పోయానని శశిథరూర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement