Thursday, April 25, 2024

క్రిష్, వైష్ణవ్ కొత్త సినిమా టైటిల్ కు ముహూర్తం ఫిక్స్

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ… ఇప్పటి వరకు టైటిల్ ని మాత్రం చిత్ర యూనిట్ ప్రకటించలేదు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆగస్టు 20న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement