Thursday, October 10, 2024

pushpa 2 లేటెస్ట్ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే

సుకుమార్ ద‌ర్శక్వంలో అల్లు అర్జున్ న‌టిస్తొన్న ‘పుష్ప: ది రూల్’ కోసం వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8న) సందర్భంగా మూవీనుంచి మాస్ క్లాసిక్ టీజర్ రిలీజ్ చేసి అభిమానులను అలరించారు. ఇక తాజగా, ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను రేపు సాయంత్రం 4:05 కు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా ఇది ఆగస్ట్ 15 న థియేటర్లలోకి రానుంది .

Advertisement

తాజా వార్తలు

Advertisement