Friday, May 3, 2024

CSK Vs LSG | టాస్ గెలిచిన లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే

ఐపీఎల్‌ 2024 లో నేడు (మంగళవారం) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సీఎస్‌కే డెన్ చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా.. ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుని సీఎస్‌కేను బ్యాటింగ్‌కు ఆహ్యానించింది.

జట్ల వివరాలు :

లక్నో సూపర్ జెయింట్స్:

లోకేశ్ రాహుల్ (c & wk), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ రవిసింగ్ ఠాకూర్.

చెన్నై సూపర్ కింగ్స్ :

రుతురాజ్ గైక్వాడ్ (c), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (wk), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్:

CSK : షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, సమీర్ రిజ్వీ

LSG : దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, కృష్ణప్ప గౌతం, అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్.

సమఉజ్జీల పోరులో పైచేయి ఎవ‌రిదో…

ఇప్పటికి చెన్నయ్ 4వ స్థానంలో ఉంది. దీని తర్వాత 5వ స్థానంలో లక్నో ఉంది. రెండు జట్లు 7 మ్యాచ్ లు ఆడి 4 గెలిచి, మూడింట ఓడి పోయాయి. ఈ సీజ‌న్ ప్రారంభంలో బ్రహ్మాండంగా ఆడిన చెన్నయ్ సూపర్ కింగ్స్ తర్వాత నెమ్మదించింది. మరోవైపు మొదట్లో తడబడిన లక్నో… తర్వాత పుంజుకుంటోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్ లు జరిగాయి. చెరో రెండో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో నేడు జరగబోయే మ్యాచ్‌లో… రుతురాజ్ కెప్టెన్సీ, కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఎవరిది పై చేయి అవుతుందో అని అందరిలో ఉత్కంఠ బయలుదేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement