Tuesday, November 28, 2023

BJP Palmistry – ఓడితే కేసీఆర్‌ను వృద్ధాశ్రమంలో కెటిఆర్ చేర్చ‌డం త‌ధ్యం – బండి సంజయ్

పాలమూరు ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే కేసిఆర్ ను కేటీఆర్ వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్షల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. డిసెంబ‌ర్ 3 తారీఖు నాడు కేసీఆర్ మాజీ సీఎం అవుతారు అంటూ జోస్యం చెప్పారు.

ఈసారి కమలం పువ్వుకు ఓటు వెయ్యకపోతే పేదలను ఎవరు కాపాడలేరన్నారు. పేపర్ లికేజ్ కోసం తాను పోరాడితే తనను పోలీసులు గొడ్డును లాక్కుపోయినట్లుగా లాక్కుపోయారని అన్నారు. నామీద 74 కేసులు ఉన్నాయన్నారు. మీ కోసం మేం మా బతుకులు నాశనం చేసుకున్నామన్నారు. మీరంతా సినిమాలు చూస్తు ఎంజాయ్ చేస్తే మేమంతా మీకోసం పోరాడుతున్నామన్నారు. మీరు హోటల్స్ కు వెళ్తే..మేము మా కుటుంబానికి దూరమై మీకోసం పోరాడతున్నామని అటువంటి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. పాలమూరు మంత్రి కబ్జాలు, దందాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించారని..ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకొని తమపై కేసులు పెడుతున్నారు అంటూ విమర్శించారు.

- Advertisement -
   

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉత్తమ్ ఊరుకుంటారా…? ఉత్తమ్ ముఖ్యమంత్రి అయితే రాజగోపాల్ ఊరుకుంటారా…? అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు. అలాగే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. కవిత ఊరుకుంటుందా..? కవిత ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు ఊరుకుంటారా..?అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ల నిర్మాణాల్లో కమీషన్లు తిన్నారు అంటూ ఆరోపించారు. కేసీఆర్ ముస్లిం మహిళల బతుకులు బార్బత్ చేస్తున్నారు అంటూ విమర్శించారు. ఎంఐఎం.ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు టోపీలు పెట్టుకొని నమాజ్ లు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.12% ఓట్ల కోసం పాకులాడుతున్నారని..80% ఉన్న హిందూ సమాజం జాగృతం కావాలి అంటూ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement