Thursday, November 30, 2023

WC Final | భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే!

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. కాగా, ఈ టైటిల్ పోరులో భార‌త్ – ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుండ‌గా.. ఈ మ్యాచ్ కు విధులు నిర్వహించే అంపైర్లను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో మరియు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్‌కి రిఫరీగా వ్యవహరిస్తారు.

- Advertisement -
   

50 ఏళ్ల రిచర్డ్ కెటిల్‌బరో ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి. అతను ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత అంపైరింగ్ కెరీర్‌ని ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు 112 టెస్టులు, 159 వన్డేలు, 51 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశాడు. అంపైరింగ్‌లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నాడు.

మరో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ కూడా బ్రిటన్‌కు చెందినవాడు. ఇంగ్లండ్ తరఫున జాతీయ జట్టుకు కూడా ఆడాడు. ప్రధానంగా ఎడమచేతి వాటం స్పిన్నర్. క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన తర్వాత అంపైరింగ్ వైపు అడుగులు వేశాడు. అంతర్జాతీయ స్థాయిలో, అతను 92 టెస్టులు, 159 ODIలు మరియు 40 అంతర్జాతీయ T20 మ్యాచ్‌లలో అంపైర్‌గా వ్యవహరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement