Thursday, May 16, 2024

BJP – రేపు నిజ‌మాబాద్ లో ‘మోడీ’ కృత‌జ్ఞ‌త స‌భ – ఢిల్లీలో అమిత్ షాతో కిష‌న్ రెడ్డి భేటి..

నిజామాబాద్ కు ప్రధాని మోడీ రేపు రానున్నారు.. రేపటి ప్రధాని మోడీ పర్యటనకు కోసం భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణకు పసుపు బోర్డును మోడీ ప్రకటించడంతో ఇందూర్ ప్రజా ఆశీర్వాద సభను మోడీ కృతజ్ఞత సభగా మార్చారు. మోడీ నిజామాబాద్ టూర్‌కు ముందే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పసుపు బోర్డు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ సభలో తెలంగాణకు మరిన్ని ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజామాబాద్ వేదికగా 8 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలోనే నేటి ఉద‌యం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రధాని మోడీ నిజామాబాద్ పర్యటన, కొందరు పార్టీ నేతల అసంతృప్తి తదితర అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కూడా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్య నేతల అభ్యర్థితత్వంపై బీజేపీ అధినాయకత్వం ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ సీఈసీలో చర్చించిన తర్వాత ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని కొందరు పార్టీ నేతల అసంతృప్తికి సంబంధించి కిషన్ రెడ్డి నుంచి అమిత్ షా వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే మంగళవారం రోజు ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటనపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్ననేపథ్యంలో మరిన్ని మోదీ సభలు పెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, నిర్మల్‌లలో కూడా ప్రధాని మోడీ పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement