Friday, May 3, 2024

HZB 9th Round: అధిక్యంలోనే ఈటల.. లీడ్ ఎంతంటే..

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం ఉత్కంఠభరితంగా సాగుతోంది. తాజాగా తొమ్మిదవ రౌండ్ పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1835 ఓట్ల లీడ్ లో వచ్చింది. 9వ రౌండ్ వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తంగా 4975 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా ఈటలకు 40,412 ఓట్లు రాగా.. గెల్లుకు 35,307 ఓట్లు వచ్చాయి. దీంతో ఈటల మెజారిటీ 5,105 ఓట్లకు పెరిగింది.  

కాగా ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి స్వల్ప ఆధిక్యం వచ్చింది. ఎనిమిదో రౌండ్ లో గెల్లు సొంతూరు హిమ్మత్ నగర్ కూడా ఉండడమూ కలిసి వచ్చింది. అయితే, గెల్లుకు సొంతూరులోనే తక్కువ ఓట్లు పోలయ్యాయి. హిమ్మత్ నగర్ లో బీజేపీకి 540కిపైగా ఓట్లు వస్తే.. గెల్లుకు 300 ప్లస్ ఓట్లు వచ్చాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement