Tuesday, May 14, 2024

BJP : బాబుమోహ‌న్ అల‌క‌… పోటీకి దూర‌మ‌న్న కామెడీయ‌న్‌

బీజేపీ పై బాబుమోన్ అల‌క‌చెందారు. పోటీకి దూరంగా ఉంటున్నానంటూ వాఖ్యాలు చేశారు. తన పేరు మొదటి జాబితాలో లేకపోవడంపై ఆయన పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదన్నారు. బీజేపీకీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. నా కొడుక్కి టిక్కెట్ అంటూ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

నా కొడుక్కి ఇచ్చినా దాపరికం ఎందుకు.. ఆ విషయం నాకు చెప్పాలి కదా అని ప్ర‌శ్నించారు. వరుస జాబితాల పేరుతో దాపరికం తనకు నచ్చడం లేదన్నారు. రాష్ట్ర పార్టీ పెద్దలు కావాలని తనను పక్కన పెడుతున్నట్లుగా అనిపించిందన్నారు. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని అని, అలాంటి తనను ఎన్నో జాబితాలో పెడతారని ప్రశ్నించారు. అందుకే బాధతో పార్టీకి, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాను ఫోన్ చేసినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. అధిష్ఠానం స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి పార్టీలో ఉండాలా? రాజీనామా చేయాలా? చూస్తానని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement