Wednesday, December 6, 2023

BJP – నేడు మూడు జిల్లాలలో అమిత్ షా ఎన్నికల ప్రచార సభలు…

హైదరాబాద్ – బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విడుదల చేయనున్నారు. . షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు.. మధ్యాహ్నం 12.50 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు గద్వాల నుంచి నల్లగొండకు వెళ్లనున్నారు. .

ఇక, మధ్యాహ్నం 3.35 గంటలకు నల్లగొండ బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడనున్నారు. ఇక, చివరగా సాయంత్రం 4.20 గంటలకు వరంగల్‌ చేరుకుని అక్కడి సభలో ప్రసంగించనున్నారు. వరంగల్ నుంచి సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుని..

- Advertisement -
   

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న అమిత్ షా

హోటల్‌ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌ షా రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యనేతలతో సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇక, రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి అహ్మదాబాద్‌కు అమిత్ షా బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement