Saturday, October 5, 2024

BRS Party – నేడు చేర్యాలలో కెసిఅర్ ప్రజా ఆశీర్వాద సభ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకో రెండు వారాలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు అన్ని జోరు పెంచాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచింది. నియోజక వర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు

ఈ క్రమంలోనే నేడు సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధం.. ఐదేళ్ల తమ భవిష్యత్ తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement