Saturday, May 4, 2024

Big Breaking : తెలంగాణ స‌ర్కార్ కి షాక్ ..ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని.. సీబీఐ విచార‌ణ‌కి అనుమ‌తినిచ్చిన హైకోర్టు

ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు సంచ‌ల‌న తీర్పుని ఇచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సిబిఐ విచారణకు అనుమతించింది హైకోర్టు. సీట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సిట్ ఏర్పాటును కొట్టివేసింది హైకోర్టు. సీట్ దర్యాప్తును కూడా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ ఇప్పటికే ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే.

అక్టోబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెరపైకి వచ్చింది. సిట్ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని హైకోర్టులో నిందితులు, పలువురు బిజెపి నేతలు వేసిన పిటీషన్ నీ విచారించిన కోర్టు.. పిటిషనర్ల వాదనను పరిగణలోకి తీసుకొని కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.దాంతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో వుంది తెలంగాణ సర్కార్. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో సంప్రదించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement