Friday, May 3, 2024

Big Blow to BRS – కారు దిగి హ‌స్తం గూటికి చేరిన అలంపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్ర‌హం..

మహబూబ్ నగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు మరో వారంరోజులే సమయముంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార బిఆర్ఎస్ కు ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే షాకిచ్చాడు. తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్న బిఆర్ఎస్ పార్టీకి కీలక సమయంలో షాకిచ్చారు. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్రహం ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరిపోయారు.. టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న హ‌స్తం గూటికి వ‌చ్చారు.. హైద‌రాబాద్ లోని రేవంత్ నివాసంలో అబ్ర‌హంకు పార్టీ కండువా క‌ప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

కాగా, బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముందుగా ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ లో ఆలంపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు వుంది. దీంతో ఆయన ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో బిజీబిజీగా వున్నారు. సరిగ్గా నామినేషన్ కోసం సిద్దమవుతున్న అబ్రహంకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ను క్యాన్సిల్ చేసి కొత్తవారికి అవకాశం కల్పించారు. మ్మెల్యే అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజెయుడికి కేటీఆర్ భీఫామ్ అందించారు. దీంతో అబ్రహంతో పాటు ఆయన వర్గం షాక్ కు గురయ్యింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు ఆలంపూర్ టికెట్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న అబ్ర‌హం కు ఏఐసిసి కార్యదర్శి, ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ సంప్ర‌దింపులు జ‌రిపారు. తన గెలుపు కోసం సహకరిస్తే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తామని ఒప్పించారు. దీంతో నేడు లాంచ‌నంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.. ఇప్పటికే ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని నలుగురు జెడ్పిటిసిలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సరిగ్గా ఎన్నికలకు మరో వారంరోజులు సమయం వుందనగా కేసీఆర్ పార్టీకి షాకిస్తూ అబ్రహం కాంగ్రెస్ కండువా కప్పుకోవ‌డం హ‌స్తం లో స‌రికొత్త జోష్ క‌నిపిస్తున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement