Sunday, May 19, 2024

తనుగుల నుండి ప్రారంభమైన భట్టి యాత్ర

తనుగుల క్రాస్ రోడ్డు నుంచి శుక్రవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ జెండా చేతపట్టి..ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు.. అవిశ్రాంత యోధుడిలా భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు. గ్రామగ్రామాన హారతులు పడుతున్నారు. అడుగడుగునా వినతులు అందజేస్తున్నారు. సమస్యల విలయాన్ని ఛేదించేందుకు భట్టి విక్రమార్క వస్తున్నారు. పాదయాత్రలో భట్టితో కలసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి బల్మూరి వెంకట్ లు పాదయాత్రలో ఉన్నారు.


భట్టికి హారతులతో మహిళల ఘన స్వాగతం :
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం గండ్రపల్లి గ్రామంలో పీపుల్స్ మార్చ్ లో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఈ సమయంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున భట్టి విక్రమార్కకు ఎదురువచ్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం మల్లమ్మ, దీపిక, గోదెమ్మ, కోమరమ్మ, గంగమ్మ మాట్లాడుతూ… త‌మకు ఇండ్లు రావడం లేదు, నీళ్లు రావడం లేదు, గ్యాస్ ధర కొనలేనంత ఉంది, త‌మ‌కు వచ్చే ఇందిరమ్మ ఇండ్లు రాకుండా చేశారు.. డబుల్ ఇండ్లు ఇవ్వడం లేదు.. అన్ని ధరలు పెరిగాయి, పావలా వడ్డేకే రుణాలు కావాలి అని కోరారు. వారు చెప్పేది విన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అందరికి మేలు జరుగుతుందన్నారు. ఇండ్లు లేనివారికి రూ.5 లక్షలు ఇస్తామ‌న్నారు. గ్యాస్ ను రూ.500కు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రైతుబంధు లాగే కూలీలకు కూడా కూలీ బంధు ఇస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement