Thursday, May 2, 2024

Be Alert – తెలంగాణ‌ను వ‌ణికిస్తున్న న్యుమోనియా…. జాగ్ర‌త్త‌గా ఉండాలంటున్న వైద్యులు ..

హైద‌రాబాద్ – శీతాకాలం వచ్చేసింది.. ప‌గటి పూట ఎండ తీవ్ర‌త ఉన్నా రాత్రి వాతావ‌ర‌ణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. దీంతో తెలంగాణను ఇప్పుడు న్యుమోనియా వైర‌స్ లా పాకుతోంది.. హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల ఆసుపత్రులు న్యుమోనియా రోగులతో నిండిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్నమొన్నటి వరకు భయపెట్టిన డెంగ్యూ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తున్న వేళ న్యుమోనియా ఉగ్రరూపం దాల్చుతోంది. వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే ఈ వ్యాధి రోగనిరోధకశక్తి ఉన్న వారిని టార్గెట్ చేసుకుంటుంది. అలాగే, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, పొగతాగేవారు, మద్యం తాగేవారు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు న్యుమోనియాతో దవాఖానల్లో చేరుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఈ కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు.

న్యుమోనియా బారినపడేవారిలో జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల నుంచి ఇది దగ్గు, తమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని, కాబట్టి రోగులు మాస్కు ధరించాలని వైద్యులు తెలిపారు. పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement