Thursday, May 2, 2024

Indrakiladri .ఏడవ రోజు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు.. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం…

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో ..విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీదేవి, ఏచక్ర, శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా పంచ దాసక్షరి మహా మంత్ర దేవతగా తనను కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహించే శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష్మి దేవి, సరస్వతి దేవి ఇరువైపులా వింద్యమరాలతో సేవిస్తుండగా, చిరు మందహాసంతో భక్తు పావనాన్ని చిందే చెరుకు గడలు చేత పట్టుకుని, శివుని వృక్షస్థలంపై కూర్చుని దేవి దర్శన భాగ్యం భక్తులను కనువిందు చేస్తోంది. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో నేడు శ్రీ కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఉదయం 2 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని అధికారులు కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి క్యూ లైన్ల ద్వారా చేరుకుంటున్నారు. శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వీఐపీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి చేరుకున్నారు. కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి దేవాలయం తో పాటు శ్రీకాళహస్తి దేవాలయం నుండి అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలతో పాటు సారెను అధికారులు తీసుకువచ్చి సాంప్రదాయబద్ధంగా అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement