Friday, May 17, 2024

Baloons Open – చెట్టుని ఢీకొన్న కారు -ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం

కరీంనగర్: రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 2కే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హుజురాబాద్ కు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెళ్తుండగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శంషాబాద్ గ్రామ శివారులో ఆయన ప్రయానిస్తున్న కారుకు ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో డ్రైవర్ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కారు రోడ్డు పక్కన కు దూసుకెళ్ళి చెట్టును ఢీకొంది.

కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డి తో పాటు కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో శంషాబాద్ గ్రామానికి చెందిన బూస సంపత్ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా కౌశిక్ రెడ్డి వెంట ఉన్న కారులో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరో కారులో కౌశిక్ రెడ్డి హుజురాబాద్ బయలుదేరి వెళ్లారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement