Wednesday, May 1, 2024

స్వచ్ఛ సర్వేక్షన్ పై అవగాహన కార్యక్రమం

శంకర్ ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం శంకర్ పల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో హోటళ్లు, వ్యాపారసంస్థలు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తడి చెత్త, పొడి చెత్త ఎలా వేరు చేయాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు. మనం బాధ్యతగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి, అధికారులు జైరాజ్, ఎన్విరాన్ మెంట‌ల్ ఇంజనీర్ ఆనంద్, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement