Sunday, May 5, 2024

జోమాటో, ఫుడ్ అగ్రిగేట‌ర్ యాప్ ల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ‘ఐకాన్ స్టార్’

ఓ ప‌క్క సినిమాల‌తో బిజీగా ఉంటూనే ప‌లు యాడ్స్ ల‌లో కూడా న‌టిస్తుంటారు సినీ న‌టులు. ప్ర‌ముఖ ఫుడ్ అగ్రిగేట‌ర్ యాప్, జోమాటో కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతకం చేశాడు. ఈ మేర‌కు హైద‌రాబాద్ లోని స్టార్ హోట‌ల్ లో ఈ యాడ్ షూట్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. డైరెక్ట‌ర్ క్రిష్ ఈ యాడ్ ని డైరెక్ట్ చేస్తున్నార‌ట‌. కాగా అల్లుఅర్జున్ తో క‌లిసి నేహాశెట్టి కూడా న‌టిస్తోంది ఈ యాడ్ లో. త్వరలోనే ఈ యాడ్ కి సంబంధించిన ప్రకటన విడుదల కానుంది. పుష్ప‌ తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన బన్నీ ఈ యాడ్ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడ‌ట‌. కాగా బన్నీ జొమాటో కోసం భారీ స్థాయిలో ప్రచారం చేయనున్నాడు. ఇందు కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement