Tuesday, May 14, 2024

చెన్నూరు సిగలో మరో నగ.. భారీ ఎత్తిపోతల పథకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్

70 ఏళ్ల చెన్నూరు నియోజకవర్గ చరిత్రలో ఈ రోజు మరువలేనిది. గతంలో ఇక్కడి నుంచి గెలిచి.. పెద్ద పెద్ద పదవుల్లో ఊరేగిన నేతలెవరూ చేయలేని గొప్ప కార్యానికి అడుగు ముందుకు పడింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూరుకు మరో కానుక అందించారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి త్వరలో టెండర్లు పిలువబోతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తనను ఆదరించి, అక్కున చేర్చుకున్న నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించాలన్న తపనకు, కష్టానికి తగిన ఫలితం దక్కబోతుండటంపై విప్ బాల్క సుమన్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావులను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

చెన్నూరు ఎత్తిపోతల పథకం గురించి గతంలో విప్ బాల్క సుమన్ ప్రకటించినప్పుడు అయ్యేదా.. పొయ్యేదా… అంటూ విమర్శలు చేసిన వారికి ఈ పరిణామం చెంప పెట్టులా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. చరిత్ర కలిగిన చెన్నూరు నుంచి గతంలో ఎందరో ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో చాలా మంది కీలక పదవులు నిర్వహించారు. అయినా సాధించిన ప్రగతి శూన్యం. గోదావరి, ప్రాణహిత లాంటి జీవ నదులు పక్కనే ఉన్నా… ఒక్క ఎకరానికి కూడా సరిగ్గా సాగు నీరు అందించలేక పోయారు. ప్రజలకు మేలు కలిగే శాశ్వత అభివృద్ధి పనులు కాకుండా…. తమకు వ్యక్తి గతంగా లబ్ది చేకూరే స్కీంలపైనే దృష్టి పెట్టారు. దాని ఫలితమే చెన్నూరు వెనుకబాటుకు కారణం. గత పాలకుల వైఫల్యాలను గుర్తించిన బాల్క సుమన్… తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చెన్నూరు భవిష్యత్ ను మార్చేందుకు శ్రీకారం చుట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement