Sunday, April 28, 2024

TS Assembly : ప్రమాదంలో మరో బ్యారేజీ … మంత్రి ఉత్తమ్

మేడిగడ్డ బ్యారేజీ నాణ్యతా లోపంతోనే కుంగిపోయిందని, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజీలో కూడా నీరు లీక్ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏ టీమ్ ను పిలిపించి అన్నారం డ్యామ్ ను పరిశీలించాలని కోరిందన్నారు.

ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతా లోపంతో బ్యారేజీ కుంగిందన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తి దెబ్బ తిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లలోనే కుప్పకూలిందన్నారు.

ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం రూ.1800 కోట్లకు టెండర్లు పిలిచారు. అంచనా వ్యయం రూ.4500 కోట్లకు పెంచారన్నారు. ఇంత అవినీతి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగలేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement