Monday, April 29, 2024

AP: వ‌సూలు రాజా కేశినేని నాని… చిన్ని సైట‌ర్లు…

కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయని… కేశినేని నాని వసూలు రాజా అంటూ కేశినేని చిన్ని సెటైర్లు విసిరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశారని ఆరోపించారు. కేశినేని నాని ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు.

విజయవాడ వెస్టులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారన్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ‘‘నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారు’’ అని హెచ్చరించారు. జగన్ వద్ద.. వైసీపీ ఇంచార్జ్‌ల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారన్నారు. కేశినేని నానిది సైకో మనస్తత్వమని మండిపడ్డారు. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. అవినాష్, వెలంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ పని చేస్తున్నారని కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement