Monday, October 7, 2024

TS: కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై బర్త్ డే విషెస్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ఆమె విషెస్ తెలిపారు.

కేసీఆర్ నిండునూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు కేసీఆర్ పుట్టినరోజున బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపునిచ్చారు. కేవలం తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో ఉన్న కేసీఆర్ అభిమానులు కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement