Saturday, May 4, 2024

TS | కోకాపేట భూములపై అన్నీ త‌ప్పుడు క‌థ‌నాలు.. అత‌నో బ్లాక్ మెయిల‌ర్ అన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ!

కోకాపేట ల్యాండ్ వ్యవహారంలో త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్తా క‌థ‌నాల‌ను న‌మ్మొద్ద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అన్నారు. అలంపూర్ లో ఇవ్వాల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ముందుగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంత‌రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గోల్డ్ ఫిష్ చైర్మన్ చంద్రశేఖర్ వైగో ఒక బ్లాక్ మెయిలర్ అని, అతని పై 12 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులు ఉన్నాయని అన్నారు.

నాలుగు రోజులుగా త‌న‌పై అదే విధంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై కోకాపేటలో భూ కబ్జా చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. సర్వే నెంబర్ 85లోని 2 ఎకరాల-33 గుంటలు 2013 సంవత్సరంలో స్వతహాగ కొన్నానని, అది తన సొంత భూమి అని దాన్ని ఎలా చేసుకుంటానని అన్నారు. గోల్డ్ ఫిష్ సంస్థతో 2014 తో డెవెలప్మెంట్ చేయడానికి అగ్రిమెంట్ చేశామని తెలిపారు. గోల్డ్ ఫిష్ సంస్థ నేటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు.

ఈ విషయంపై 2021 లో నేను కోర్ట్ కు వెళ్ళాన‌ని. తన ప‌క్క ప్లాట్ లో కూలీలు గుడిసెలు వేసుకున్నార‌ని, తాము ఎవరి మీద దౌర్జన్యం చేయలేదన్నారు. హీరో ప్రభాస్ బందువు సత్యనారాయణ, సంజయ్ కమతం, తాను మొదలగు వారు అదే కోకాపేటలో 4 ఎకరాలలో విల్లాస్ కట్టుకోవడానికి డబ్బులు కడితే కూడా పట్టించుకోకుండా ఉన్నందుకు ఆ విషయం పై కోర్ట్ కు వెళ్ళామని తెలిపారు. గోల్డ్ ఫిష్ చైర్మన్ చంద్రశేఖర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడడమే అతని నైజం అని ఆరోపించారు.

కోకాపేట భూముల వ్యవహారానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, కానీ అతనిపై కంప్లెయింట్ ఇచ్చార‌న్నారు. 1998లో తాను రాజకీయ అరంగేట్రం చేశాన‌ని, త‌న తాత‌, తండ్రి రాజకీయంలో ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌కు ఎలాంటి మచ్చ లేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు సంజాయిసి ఇచ్చుకోవాలని ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement