Monday, April 29, 2024

Alert – రైతన్నలు జర జాగ్రత్త.. కాంగ్రెస్ నైజం బయటపడింది – .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్ద‌ప‌ల్లి – కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని రైతన్నలు గ్రహించి ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైతు వేదికలో రాఘవపూర్, అందుగులపల్లి, గౌరెడ్డి పేట,అందుగులపల్లి,రంగాపూర్, దేవునిపల్లి,సబ్బితం, గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను అరిగోస పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెసోళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. సకల సౌలతులు కల్పిస్తున్న బీఆర్ఎస్ ను, సిఎం కేసిఆర్ ను ఆశీర్వదించాలన్నారు. 24 గంటల కరెంటు పై కుట్రలు చేస్తున్న కాంగ్రెసోళ్లను ఊర్లకు వస్తే నిలదీసీ తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి రైతుల కంట కన్నీరు కారిందన్నారు. తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేక అన్నదాతల గుండెలు ఆగిపోయాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలోని కరెంట్ కష్టాలను అంత తొందరగా ఎలా మర్చిపోతామని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడామన్నారు.9 ఏళ్లలోనే నాలుగున్నర లక్షల కోట్లను ఖర్చు చేసి సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. మూడు పంటల తెలంగాణ కావాలని బీఆర్‌ఎస్ సంకల్పం తీసుకుంటే, మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ రైతు ద్రోహ విధానాన్ని ప్రకటించిందన్నారు. మూడు పంటల బీఆర్‌ఎస్ కావాలా-మూడు గంటల కాంగ్రెస్ కావాలా…తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్,సర్పంచ్ లు సది, శారదా-శ్రీనివాస్, ఎంపీటీసీ లు శ్రీనివాస్,లక్ష్మణ్,మాజీ సర్పంచ్ రామస్వామి, మాజీ ఎంపీటీసీ సదయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న బాబు,మహేందర్,సదయ్య,రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ లు గాండ్ల సదయ్య,ఉప సర్పంచ్ లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement