Monday, May 20, 2024

Admissions – తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్

హైద‌రాబాద్ – తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2024-2025 విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లు కల్పించనున్నారు. పదో తరగతి అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి ప్రవేశాల కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31.

ముఖ్యమైన వివరాలు :
తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లలో అడ్మిషన్లు పొందవచ్చు.
పదో తరగతిలో అర్హత సాధించిన విద్యార్థులు మోడల్ స్కూళ్లలో ఇంటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

- Advertisement -

దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ:మే 10, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2024
ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితా విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement