Monday, April 29, 2024

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు హామీని నెరవేర్చాలి

శ్రీరాంపూర్, జూన్ 8 (ప్రభ న్యూస్) : సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ డివిజన్ చంద్రమోహన్ అధ్యక్షతన శ్రీరాంపూర్ ఓసిపిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ లు మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతామని 2018లో హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు హామీలను నెరవేర్చలేదన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నస్పూర్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే సింగరేణి యాజమాన్యం అమలు చేసే విధంగా యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. సింగరేణిలో దాదాపు 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సాధిస్తున్న లాభాలలో సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దాగి ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణి సంస్థ నడపలేరని, ఈ లాభాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల్లో వాటా చెల్లించాలని సింగరేణి యాజమాన్యం కోలిండియాలో అమలవుతున్న ఒప్పందాలను హై పవర్ కమిటీ వేతనాలను చెల్లించాలన్నారు.

కోల్ ఇండియాలో చెల్లిస్తున్నటువంటి ప్రమాదంలో ఏదైనా కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోతే 15 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నటువంటి కోల్ ఇండియా సింగరేణి యాజమాన్యం కూడా అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోతే 15 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాల్నారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని, గతంలో కాంట్రాక్ట్ కార్మికులు 18 రోజుల సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలతో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలన్నారు. తదితర అంశాల పైన ఈనెల 11వ తేదీన కొత్తగూడెంలో జరిగే ప్రజా గర్జన బహిరంగ సభకు కాంట్రాక్టు కార్మికులు సింగరేణి వ్యాప్తంగా అధిక సంఖ్యలో హాజరై కాంట్రాక్టు కార్మికుల ఐక్యతను చాటాలన్నారు. ఈ యొక్క ప్రజా గర్జన సభ విజయవంతం ద్వారా మన హక్కులు సాధించడంలో భవిష్యత్తులో సాధించుకునే హక్కులకు ఈ సభ దోహదపడుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో కే.శ్యామ్, సంతోష్, వెంకటేష్, శైలజ, సాలక్క, రాజేశ్వరి, శంకర్, లక్ష్మి, ఫర్జానా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement