Thursday, April 25, 2024

WTC Final: స్టీవెన్ స్మిత్ సెంచరీ.. ఆసీస్ స్కోరు 336/3

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీ చేశాడు. స్టీవెన్ స్మిత్ 31వ సెంచరీ చేశాడు. 229 బంతుల్లో స్టీవెన్ స్మిత్ 100 పరుగులు పూర్తి చేశాడు. రెండో రోజు ఆట మొదలైంది. తొలి ఓవర్ లోనే స్మిత్ వరుస ఫోర్లతో సెంచరీని పూర్తి చేశాడు. స్మిత్ సెంచరీ చేసిన సమయానికి ఆస్ట్రేలియా జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 336 పరుగులుగా ఉంది. అలాగే ట్రావిస్ హెడ్ సెంచరీతో నాటౌట్ గా బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement