Friday, May 3, 2024

రిటైర్డ్ కార్మికులకు సన్మానం..

కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట గనిలో విదులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న కార్మికులను గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు గనంగా సన్మానించారు. భైరబోయిన సిద్దయ్య (హాలర్‌ ఆపరేటర్‌), ఎండి నాసర్‌ (సపోర్ట్మెన్‌) కార్మికులకు గని మెనేజర్‌ భూ శంకరయ్య పూలదండలు, శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందచేసి గణ వీడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి సునీల్‌, ఇంజనీర్‌ శేఖర్‌, సంక్షేమాధికారి మైత్రేయభందు, కార్మిక సంఘాల నాయకులు వోడ్నాల రాజన్న, మేడ సమ్మయ్య, దుగుట శ్రీనివాస్‌, దాగం మల్లేష్‌, బియ్యాల వెంకటస్వామి ఆయా డిపార్ట్‌మెంట్‌, క్యాటగిరిలకు చెందిన కార్మికులు గని అధికారులు,రిటైర్డ్‌ కార్మికుల బందువులు తదితరలు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement