Sunday, April 28, 2024

నవతరానికి స్ఫూర్తి ప్రదాత పూలే : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

చెన్నూర్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు పూలే అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూరు నియోజక కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పట్టణంలోని పూలే విగ్రహాన్నికి పూలమాల వేసి నివాళులర్పించారు. న‌వ‌త‌రానికి పూలే స్ఫూర్తి ప్ర‌దాత అని, ఆశయ సాధనలకు అందరం కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement