Wednesday, April 14, 2021

మాస్కుల పంపిణీ..

భీమిని : మంచిర్యాల మండలం భీమిని మండల కేంద్రంలో జేసీబీ యజమాని విష్ణువర్దన్‌రావు కరోనా నివారణలో భాగంగా సుమారు 500 మందికి మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిని ఎస్సై కొమురయ్య హాజరై మాస్కులను ప్రజలకు అందించారు. అనంతరం ఎస్సై కొమురయ్య మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తప్పకుండా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, గుంపులుగుంపులుగా తిరగవద్దని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. మాస్కు ధరించకుండా ఎవరు కనిపించినా రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ సత్తయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News