Saturday, April 20, 2024

వీడియో: మాస్కు సరిగ్గా పెట్టుకోలేదని కుమ్మేసిన పోలీసులు

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా కొందరు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కులు సరిగ్గా ధరించని వారిని మధ్యప్రదేశ్ పోలీసులు కుమ్మేస్తున్నారు. ఇండోర్‌లో ఓ వ్య‌క్తి మాస్కు స‌రిగా ధ‌రించ‌లేద‌ని మంగళవారం నాడు అత‌డిని పోలీసులు దారుణంగా చిత‌క‌బాదారు. 35 ఏళ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి హాస్పిట‌ల్లో ఉన్న తన తండ్రి కోసం భోజ‌నం తీసుకెళ్తున్నాడు. అయితే అత‌ను స‌రిగా మాస్కు ధ‌రించ‌లేద‌ని పోలీసులు ఆపారు. ఆ త‌ర్వాత అత‌న్ని రోడ్డుపై ప‌డేసి తీవ్రంగా కొట్టారు. త‌ల‌పై కాలు పెట్టి తొక్కారు. ఆ వ్య‌క్తి బంధువులు ఎంత వేడుకున్న‌ప్ప‌టికీ పోలీసులు క‌నిక‌రించ‌లేదు. ఈ దృశ్యాల‌ను అక్క‌డున్న కొంద‌రు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారులు స్పందించారు. కాగా స‌ద‌రు వ్య‌క్తిని కొట్టిన ఇద్ద‌రు పోలీసుల‌ను స‌స్పెండ్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement