Sunday, May 5, 2024

Khanapur : ఎమ్మెల్యే అనుచరుడిపై కత్తితో దాడి

ఖానాపూర్ రూరల్, జూన్ 14 (ప్రభ న్యూస్) : మండలంలోని గోసంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు బీఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్ చార్జి శోభన్ పై దగ్గరి బంధువు కత్తితో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

పరామర్శించిన ఎమ్మెల్యే రేఖా నాయక్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభ‌న్ ని ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్ పరామర్శించారు. దుండగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement