Monday, April 29, 2024

New Dress Code – నోయిడాలో లుంగీ, నైటీలు బ్యాన్…

గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీకి చెందిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానికంగా నివసించే ప్రజలు డ్రెస్ కోడ్‌ను పాటించాలని, తద్వారా మహిళలు, పురుషులు ఒకరినొకరు గౌరవించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అపార్ట్‌మెంట్‌లో నివసించే ప్రజలు అపార్ట్‌మెంట్‌లో, అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పార్కులో నైటీలు, లుంగీలు ధరించి తిరగొద్దని సూచించారు.. మీరు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మీ ప్రవర్తనపై ఎవరైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఇవ్వద్దు. మీ ప్రవర్తన, దుస్తులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఇందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ నివాసం నుంచి బయటకు వచ్చే సమయంలో లుంగీ, నైటీని ఎట్టిపరిస్థితుల్లోనూ ధరించవద్దు. లుంగీ, నైటీ ధరించి అపార్ట్‌మెంట్‌లో సంచరించడం చేయవద్దని అసోసియేషన్ పేర్కొంది.

. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు సొసైటీ నిర్ణయానికి మద్దతు తెలుపుతుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం. ప్రతీఒక్కరూ డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. పెద్దవారు బయటకు వచ్చినప్పుడు గౌరవంగా ఉండే డ్రస్సులు ధరించాలి. తద్వారా పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు. సొసైటీ తీసుకున్న నిర్ణయం బాగుంది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. మరో నెటిజన్ సొసైటీ నిర్ణయాన్ని తప్పుబట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement