Sunday, May 5, 2024

సమస్యల వలయంలో ‘జ్యోతిబా పూలే’ గురుకులం

  • పాఠశాల ప్రిన్సిపల్ పై ఫిర్యాదులు వెల్లువ
  • కలెక్టర్ ను కలిసి గోడు వెల్లబోసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు
  • పాఠశాల నిర్వాహణపై విద్యార్థి సంఘాల ఆందోళన
  • స్పందించి పాఠశాలను సందర్శించిన కలెక్టర్
  • వ్యవస్థను మెరుగుపరుస్తామని వెల్లడి

బైంసాలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గురువారం బైంసా పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డిని పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్థానిక విశ్రాంతి భవనంలో కలిసి ప్రిన్సిపల్ వ్యవహార శైలిని వివరించారు. పాఠశాలకు సంబంధించిన టీవీని ఎవరో పగులకొడితే పదవ తరగతి ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన తమ పిల్లలను పంపడం లేదన్నారు. పగిలిన టీవీ కోసం గాను పదవ తరగతికి చెందిన ప్రతి విద్యార్థి రూ.1500 చొప్పున జరిమానగా చెల్లించేంత వరకు పంపడాన్ని ఆపి వేసిందని, టిఫిన్ సైతం పెట్టకుండా వేధిస్తోందని కలెక్టర్ కు విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రతినిధి గంగా ప్రసాద్ నేతృత్వంలో విద్యార్ధి సంఘాల శ్రేణులు సైతం కలెక్టర్ ను కలిసి ప్రిన్సిపల్ తీరుపై ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు రుచికరంగా ఉండటం లేదని, ఉడికి ఉడకని అన్నం, కూరలు పెడుతున్నారన్నారు. ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ స్పందించదని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement