Tuesday, May 7, 2024

గ్యాస్ సిలిండ‌ర్ లీక్.. కూలిన ఇల్లు, ఇద్దరికి గాయాలు

తాంసి, (ప్రభ న్యూస్) : గ్యాస్ సిలిండ‌ర్ లీకై ఇల్లు కూలి ఇరువురికి గాయాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన మీసాల కిషన్ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ మరమ్మతులు చేసే క్రమంలో గ్యాస్ ఒక్క సారిగా అత్యధిక ప్రెషర్ తో లీక్ కావడంతో ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో మీసాల కిషన్ కు తీవ్ర గాయాలు కాగా తనతో ఉన్న యువకుడు ఉపలంచి ప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement