Wednesday, May 19, 2021

ధాన్యం కొనుగోలు కేంద్రం..

కాసిపేట : మండలం మల్కెపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రైతు సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇంతకు ముందు రైతులు పండించిన ధాన్యం అమ్మకానికి దూరప్రాంతాలకు వెళ్లి లావాదేవాలు చేసేవారని, దాంతో దూర, ఆర్థిక భారం, సమయపాలనతో ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. రైతు పక్షపాతి కేసీఆర్‌ రైతు అందుబాలటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా తీవ్రమవుతున్నందున ప్రజలంతా కోవిడ్‌ నిబందనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, సహాకార సంఘం చైర్మన్‌ నీల రాంచందర్‌, వైస్‌ ఎంపిపి విక్రంరావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటి డైరెక్టర్‌ మంజుల రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు రమణారెడ్డి, సహకార సంఘం డైరైక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News