Saturday, May 18, 2024

ADB: సీఎం కేసీఆర్ చిత్రపటానికి ముస్లిం సోదరుల పాలాభిషేకం

జైనూర్, జులై28 (ప్రభ న్యూస్) : ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి గిరిజనులతో కలిసి మెలిసి జీవనం కొనసాగిస్తున్న మైనార్టీలు పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం జైనూర్ మండల కేంద్రంలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల మంజూరు చేయ‌డంతో మైనార్టీ కులపెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్క‌ర్ చౌరస్తా వద్ద స్థానిక మైనార్టీ ప్రజా ప్రతినిధులు, కుల పెద్దలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భగా జిల్లా కో ఆప్షన్ సభ్యుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఆబ్బు తాలిబ్ మాట్లాడారు. మైనార్టీ పిల్లల చదువు కోసం ఏజెన్సీ ప్రాంతంలో అందుబాటులో పాఠశాలలు లేకపోవటంతో ముస్లిం పిల్లలు విద్యకు దూరమయ్యారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి జైనూర్ లో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల మంజూరు చేయడం శుభపరిణామమని కొనియాడారు. పాఠశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సీఎం కేసీఆర్, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ‌ముద్ అలీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి ఎళ్ల వేళ‌లా రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చీర్లే లక్ష్మణ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఆఫ్రోజ్, సర్పంచులు ఆత్రం జాలిమ్, మెస్రం భూపతి, సవిత రాందాస్, సదర్ బియబాని పాజిల్, బీఆర్ఎస్ నాయకులు మెస్రం అంబాజీరావు, ఆత్రం శంకర్, ఆత్రం దత్తు, అబ్బూ, హైదర్, హైమధ్, కనక గంగారాం, అజ్జూ లాలా, ఖయ్యాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement