Monday, April 29, 2024

ADB: జైనూర్ లో రూ.7.31 ల‌క్ష‌ల‌ నగదు పట్టివేత..

జైనూర్ : ఏప్రిల్ 2 (ప్రభ న్యూస్) : రాబోయే లోక్ సభ ఎన్నికల కోడ్ లో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉషగాం సమీపంలో మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఉట్నూర్ నుండి ఆసిఫాబాద్ వెళ్తుండగా ఉషగాం సమీపంలో ఆ బస్సును తనిఖీ చేశారు.

అందులో ప్రయాణిస్తున్న గరిక ముక్కు విజయకుమారి అనే మహిళ నుండి ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 7 లక్షల 31 వేల 350 లను పట్టుకున్నట్లు జైనూర్ సీఐ కే అంజయ్య తెలిపారు. ఆ మహిళ నుండి పట్టుకున్నఆ నగదు డబ్బులను జప్తు చేసి జైనూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ కి అప్పగించినట్లు జైనూర్ సిఐ అంజయ్య తెలిపారు. ఈ తనిఖీల్లో సిర్పూర్(యు) ఎస్ఐ మాధవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement