Tuesday, October 8, 2024

Accident – టిఎస్ ఆర్టీసీ బ‌స్సు – లారీ ఢీ … 20 మందికి గాయాలు

శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం టిఎస్ఆర్టిసి బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ప‌లువురికి గాయాల‌య్యాయి… గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ డిపోకు చెందిన టి.ఎస్.ఆర్.టి.సి బస్సు నిజామాబాద్ కు వెళుతుండగా 46 మంది ప్రయాణికులు ఉన్నారని, తాడికల్ శివారులో జాతీయ రహదారి పైన మూలమలుపు వద్ద టీఎస్ఆర్టీసీ బస్సు ఎదురుగా కరీంనగర్ వైపు నుండి వచ్చిన లారీని ఢీకొట్టింది..

ఈ ప్ర‌మాదంతో బ‌స్సు డ్రైవర్ కు మరో ముగ్గురి ప్రయాణికులు తీవ్ర గాయాలు కాగా, 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించించారు. ఘటన సమాచారాన్ని తెలుసుకున్న కేశవపట్నం ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement