Thursday, May 2, 2024

అమెరికా షాపింగ్ మాల్ పేలిన తుపాకీ – ముగ్గురు మృతి..

జార్జియా అట్లాంటాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు యువకులు మరణించారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం) అట్లాంటాలోని షాపింగ్‌ మాల్‌లోకి ప్రవేశించిన సాయుధుడు యువకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు బాధితులు చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. కాల్పుల గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతుల్లో ఒకరికి 17 ఏండ్లు, మరోకరికి 20, మూడో వ్యక్తికి 30 ఏండ్ల వయస్సు ఉంటుందని చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదని, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement