Sunday, April 28, 2024

ACB Net – పాల బిల్లుకు లంచం…ఎసిబికి చిక్కిన కాకతీయ వ‌ర్శిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్​..

వ‌రంగ‌ల్ – కాకతీయ వర్సిటీలో ఓ లంచావతారం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గాఅసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి చిక్కాడు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద యూనివర్సిటీగా పేరొందిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వివిధ మెస్ లకు పాలు సరఫరా చేస్తున్న వ్యాపారి నుంచి పాల బిల్లుల చెల్లింపులకు గతంలో చిన్న మొత్తంలో లంచం తీసుకొన్న కిష్టయ్య , ప్రతి సారి బిల్లు పాస్ చేయడానికి 5శాతం లంచం కోరుతున్నాడు. దీంతో విసిగిపోయిన పాలవ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు, ఏ.అర్ కిష్టయ్య పైఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రచించారు.

అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణ‌య్య‌ తన ఆడిట్ ఆఫీస్ లో పాలవ్యాపారి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలోనూ ఫోన్ పే ద్వారా కిష్టయ్య తన దగ్గర నుంచి రూ.10వేలు వసూలు చేశారని, మిగిలిన బిల్లులను పాస్ చేయడానికి రూ.యాభై వేలు డిమాండు చేశారని, లంచం ఇవ్వకుంటే హాస్టల్ లో ఈ మధ్య జరిగిన రెండు కోట్ల కుంభకోణంపై విచారణ జరిపితే ఆ తర్వాత పాల బిల్లులు ఇచ్చేది లేదని పలుమార్లు బెదిరించారని ఏసీబీ కి పాలవ్యాపారి ఫిర్యాదు చేశారు. ఇక కిస్టయ్య పిండుడులో ఘనుడేనట. హాస్టల్ ఆఫీస్ లో నెలకు రూ యాభై లక్షల లావా దేవీలుజరుగుతాయని సమాచారం. ఐదు శాతం అంటే నెలకు రూ.2,50,000లు కిరాణా, చికెన్, బియ్యం, కట్టెలు సరఫరా వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement