Monday, April 29, 2024

తెలంగాణకు ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి.. జాతీయ ఎస్టీ కమిషన్‌కు గిరిజన సంఘాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో గిరిజన – ఆదివాసీల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ అనంత నాయక్‌ను ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఉషా కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా గిరిజన, ఆదివాసీలకు ప్రయోజనాలు అందడం లేదని తెలియజేశారు.

తెలంగాణలో ఆదివాసీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీలు వెనుకబడ్డారని వివరించారు. గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలంటే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఉండాల్సిందేనని వారు కోరారు. ట్రైబల్ ఫెడరేషన్ నేతల విజ్ఞప్తిపై స్పందించిన అనంత నాయక్, తెలంగాణలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement