Sunday, May 5, 2024

సర్వసభ్య సమావేశం నిర్వహించాలి.. కలెక్టర్ కు రైతుల నోటీసులు

నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ సహకార చక్కర కర్మాగారo (ఎన్ సి ఎస్ ఎఫ్) సారంగాపూర్ రైతు వాటాదారుల సర్వసభ్య సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును చెరుకు రైతులు కోరారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయానికి సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ కు సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నోటీసులు అందజేసి మాట్లాడారు. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం గత 14 సంవత్సరాలుగా నిర్వహించలేదని వాపోయారు.

ఈ సంవత్సరం సహకార చట్టం బైలా నెంబర్ 28ఏ ప్రకారం సర్వసభ్య సమావేశం జరుపుటకు చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ కు నోటీసులు అందజేశామని రైతులు సాయరెడ్డి, లక్ష్మారెడ్డి తెలిపారు. నోటీసులు ఇచ్చిన నెలరోజులలోపు సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని, ఒకవేళ మార్చి 28వ తేదీలోపు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే అత్యధిక చెరుకు సరఫరా రైతు వాటాదారుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు వాటాదారులు చెరుకు రైతులు తెలిపారు. కలెక్టర్ వెంటనే స్పందించి సర్వసభ్య సమావేశం నిర్వహించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఆకుల పాపయ్య, వెంకట్ రెడ్డి, బి లక్ష్మా రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement