Thursday, April 25, 2024

టూరిజం పెట్టుబ‌డులు రూ.20 వేల కోట్లు..

అమరావతి,ఆంధ్రప్రభ: విశాఖ కేంద్రంగా మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో తొలి రోజే పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. ఒక్క టూరిజం రంగంలోనే భారీ పెట్టుబడులకు ఒప్పందం జరగనుంది. తొలిరోజైన మా ర్చి 3న టూరిజం రంగానికి సంబంధించి దాదాపు రూ. 20 వేల కోట్లకుపైబడి పెట్టు బడులకు సంబంధించి ఎంఓయూలపై సంతకాలు చేసుకోనున్నారు. ఈమేరకు టూరిజం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్లు, రిసార్ట్‌లు, -టె-ంపు ల్‌ టూరిజం, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, క్రూయిజ్‌లు మరియు రోప్‌వేలలో అగ్రగామిగా ఉన్న పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందు కు ముందకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారతదేశంలోని ప్రధాన పర్యాటక గ మ్యస్థానంగా మార్చడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఈ కంపెనీలు పెట్టు బడులు పెట్టనున్నాయి. హాస్పిటాలిటీ- రంగంలో అగ్రగామిగా ఉన్న ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ నిర్మాణానికి ముందుకొస్తోంది. ఇది భీమిలికి 20 కీమీ దూరంలో ఉన్న అన్నవరం వద్ద రిసార్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అలాగే, హార్సిలీ హి ల్స్‌, పిచిక లంక, తిరుపతి మరియు గండికోట వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఆ గ్రూపునకు చెందిన హోటల్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీనితోపాటు అనేక అమెరికన్‌ కంపెనీలు కూడా రాష్ట్రంలో హోటళ్లు మరియు రిసార్ట్‌లలో పెద్ద ఎత్తున పెట్టు-బడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఒబెరాయ్‌ తమ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత అమెరికన్‌ కంపెనీలు వాటిని అనుసరిస్తాయని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

గోదారిపై బ్రిడ్జి అభివృద్దికి…
తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలో గోదావరి నదిపై కూడా పలు కంపెనీలు దృష్టి సారించాయి. 1897లో నిర్మించబడిన హేవ్‌లాక్‌ బ్రిడ్జిని కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చర్యలు చేపట్టనున్నారు. కొత్త ఆర్చ్‌ వంతెన నిర్మాణం తర్వాత ఈ హేవ్‌లాక్‌ బ్రిడ్జి వాడుకలో లేకుండా పోయింది. ఇప్పుడు పెట్టుబడుల రాకతో దీనికి సరికొత్త శోభ సంతరించుకోనంది. పరిసర ప్రాంతాలు కూడా టూరిజంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడింది. హేవ్‌లాక్‌ బ్రిడ్జ్‌ కింద ఉన్న ప్రాంతం మరియు పైన ఉన్న ప్రాంతం అడ్వెంచర్‌ మరియు వాటర్‌ స్పోర్ట్స్‌ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయ నున్నారు. ఈహేవ్‌లాక్‌ వంతెన వెంట రోప్‌వే కూడా ఉండను-ంది. దీంతో పాపికొండలు, కొవ్వూరు చుట్టు-పక్కల అభివృద్ధి ఉండను-ంది. హేవ్‌లాక్‌ వంతెనకు సంబంధించిన డీటెల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సిద్ధం చేశారు. ఈవంతెన చుట్టూ అభివృద్ధికి సంబంధించి రూ. 800 కోట్ల పెట్టు-బడి అవసరమని అంచనా వేసి డీపీఆర్‌లు సిద్ధంచేశారు.

టెంపుల్‌ టూరిజం
అదేవిధంగా -టె-ంపుల్‌ టూరిజంను సులభతరం చేసే కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సందర్శించే యాత్రికులకు సేవలను అందించడానికి ఏజెన్సీ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేస్తో-ంది. యాత్రీకులకు రవాణా, హోటళ్లలో వసతి మరియు దర్శనం అందిం చడంతోపాటు దేవాలయాలను సందర్శించాలనుకునే సీనియర్‌ సిటిజన్లకు ఏజెన్సీ ఎస్కార్ట్‌ సేవలను అందిస్తుంది. ప్రారంభంలో ఈసేవలు కొన్ని ఆలయాలకే పరిమి తం చేయనున్నారు. తరువాత, షిర్డీ, వారణాసి, శబరిమల వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లోని ఆలయాలతో దీనిని అనుసంధానం చేస్తారని ఒక అధికారి తెలిపారు. -టె-ంపుల్‌ టూరిజంను అమలు చేసే ఏజెన్సీ ఈ ప్రాజెక్టులో రూ. వెయ్యి కోట్ల పెట్టు-బడి పెట్టనుందని ఆయన వెల్లడించారు.

వీటిలో కూడా
వీటితోపాటు బౌద్ధ వారసత్వ ప్రదేశాలను వాణిజ్యేతర ప్రాతిపదికన అభివృద్ధి చేయనుున్నారు. ఒక అంతర్జాతీయ కంపెనీ రిసార్ట్‌తో గోల్ఫ్‌ కోర్స్‌ను ఏర్పాటు- చేయ డానికి వెయ్యి ఎకరాల భూమిని సేకరించి అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా ఏపీని టూరిజం రంగంలో అంతర్జాతీయ గమ్యస్థానంగా చేర్చేందుకు పెద్ద ఎతున పెట్టు బడులను ఆకర్షిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement