Sunday, April 28, 2024

TS: బాన్సువాడ అభివృద్ధికి రూ.600 కోట్ల నిధులు తెచ్చా.. పోచారం

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.600 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను తీసుకువచ్చానని, నియోజకవర్గంలోని ప్రజలు ఏ పని చెప్పినా ఆ పనికి నిధులు కేటాయించాలని, రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి తమ ఓటును వినియోగించుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను కోరారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్ గ్రామాన్ని సభాపతి సందర్శించగా.. గ్రామస్తులు మంగళ హారతులతో ఘన స్వాగతం గ్రామంలో రూ.రెండున్నర కోట్లతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను సభాపతి చేపట్టారు.

అనంతరం సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో రూ.50 లక్షల SDF నిధులతో నిర్మించిన యోగశాలను మంతెన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై సభాపతి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైన రూ.600 కోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నిధులతో ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులను చేపట్టామని సభాపతి స్పష్టం చేశారు. తాను 1994 లో మొదటిసారి MLA అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం ఒక్కటే జూనియర్ కాలేజీ ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గంలో 31 కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతో మన బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేశారన్నారు. 4000 ఇళ్ళను కాంట్రాక్టర్లు నిర్మిస్తే మిగితా 7000 ఇళ్ళు లబ్ధిదారులు స్వంతంగా నిర్మించుకుంటున్నారని ప్రజలకు వివరించారు.


ఇంకా ఎవరైనా పేదలు మిగిలితే గృహలక్ష్మి పథకంలో వారికి ఇంటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
తక్కువ ఖర్చుతో రోగులకు అద్భుతమైన ప్రకృతి వైద్యాన్ని అందిస్తున్న సంస్కార్ ఆశ్రమ పనితీరును వ్యవస్థాపకులు మంతెన ను సభాపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, నాగేశ్వరరావు, మున్ని, జిల్లా పరిషత్ సభ్యులు గంగారం, నాయకులు ప్రసాద్, రామా గౌడ్, యువ నాయకులు కన్నె రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement