Sunday, May 26, 2024

నేరేడుగొమ్ము క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌లో -17మందికి క‌రోనా

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాగా న‌ల్గొండ నేరేడుగొమ్ము కస్తూర్బా గాంధీ పాఠశాలలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కస్తూర్బా గాంధీ పాఠశాలలోని విద్యార్తులు జ్వరం, దగ్గుతో బాధ పడుతుండటంతో.. అక్కడి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని వైద్య శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో పాఠశాలకు చేరుకున్న వైద్య సిబ్బంది.. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఒక ఉపాధ్యాయురాలికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రలు పాఠశాల వద్దకు చేరుకున్నారు. తెలంగాణలో బుధవారం 41,182 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 992 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,22,663కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 376 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 54, రంగారెడ్డిలో 65 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సంగారెడ్డి, పెదపల్లి.. జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement