Wednesday, June 12, 2024

IPL FINAL : చివ‌రి యుద్ధం…చెన్నై స‌న్న‌ద్ధం…స‌న్ తో కోల్ క‌తా ఢీ

ఐపీఎల్ 2024 సీజన్‌లో హీరో ఎవరో తెలిసిపోయేది నేడే. ట్రోఫీ కోసం పది జట్లు పోటీపడగా చివరకు మిగిలినవి రెండు జట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో పోటీ పడనున్నాయి. దీంతో చివరి పోరు రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు రెండో ట్రోఫీ కోసం హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ, మరోవైపు మూడో ట్రోఫీ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -

చెన్నై చిదంబరం స్టేడియం( చెపాక్) వేదికగా జరగనున్న ఫైనల్లో నేటి రాత్రి 7:30 గంటలకు స‌న్ రైజ‌ర్స్ , కెకెఆర్ జ‌ట్లు చివరి సమరానికి సై అంటున్నారు. ఈ సీజన్‌లో కోల్‌కతాతో ఆడిన రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలయ్యింది. దీంతో ఎలాగైనా రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతోనే తలపడింది. ఈ మ్యాచులో ఎస్ ఆర్ హెచ్ గెలుపు ముంగిట బోల్తా పడింది. ఇక క్వాలిఫైయర్-1లో కోల్‌కతా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించి నేరుగా ఫైనల్ చేరుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్‌లో నెగ్గిన రాజస్థాన్‌‌తో తలపడాల్సి వచ్చింది. క్వాలిఫైయర్‌-2లో అన్ని విభాగాల్లో రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ ఎగురేసుకుపోవాలని ప్రణాలికలు రచిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇప్పటివరకు 27 మ్యాచుల్లో తలపడగా కేవలం తొమ్మిదింట్లో మాత్రమే విజయం సాధించింది. 18 మ్యాచుల్లో కోల్‌కతా విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్
చెపాక్ స్లో పిచ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా స్పిన్నర్లకు, స్లో బౌలర్‌లకు సహాయం చేస్తుంది. అయితే, ఈ వేదికలో ఎక్కువ స్కోర్లు నమోదయ్యే ఆస్కారం తక్కువ.

వాతావ‌ర‌ణం
మ్యాచ్ సమయంలో చెన్నైలో ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీలు ఉంటుంది, కానీ 37 డిగ్రీలుగా అనిపిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. తేమ దాదాపు 66శాతం ఉంటుంది. వర్షం పడే అవకాశం 3శాతం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement